గుంటూరు జిల్లా కృష్ణాయపాలెంలో రాజధాని రైతులు వినూత్న నిరసన తెలిపారు. అమరావతిని రక్షించాలంటూ శాసనసభకు వెళ్తున్న ఎమ్మెల్యేలు, మంత్రులకు మహిళలు హారతులు ఇచ్చారు. ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగేలా అసెంబ్లీలో మాట్లాడాలంటూ విజ్ఞప్తి చేశారు. 351 రోజులుగా ఉద్యమం చేస్తున్నా..... ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులకు తమ మనోవేదన అర్థం కావాలనే ఉద్దేశంతోనే ఈ నిరసన కార్యక్రమం చేపట్టామని చెప్పారు.
ప్రజాప్రతినిధులకు హారతులిచ్చి నిరసన తెలిపిన రాజధాని రైతులు - amaravathi women farmers protest news
రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రైతులు ఉద్యమం చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో వినూత్న నిరసన తెలిపారు.
![ప్రజాప్రతినిధులకు హారతులిచ్చి నిరసన తెలిపిన రాజధాని రైతులు amravathi farmers protest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9734131-1091-9734131-1606883624598.jpg)
రాజధాని రైతుల నిరసన