'జగనన్న అమ్మఒడి' పథకంలో తప్పుగా నమోదైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతా, ఐఎఫ్‌ఎస్‌సీ, ఆధార్ నంబర్లను సరిదిద్దేందుకు 21వ తేదీన ఆప్షన్లు ఇవ్వనున్నారు. బ్యాంకు ఖాతా నంబరు, ఐఎఫ్‌ఎస్‌సీ, ఆధార్ నంబరు తప్పుగా నమోదు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 32వేల మంది అర్హులైన వారికి బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక సాయం జమ కాలేదు. కొందరికి సున్నా ఉన్న చోట ఆంగ్ల అక్షరం ‘వో’ నమోదు చేయడంతో నగదు జమ తిరస్కరణకు గురైంది. ఇలాంటి వాటిని సరి చేసేందుకు ప్రధానోపాధ్యాయులకు ఆప్షన్లు ఇవ్వనున్నారు. తప్పులను సరి చేసిన అనంతరం బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.
అమ్మఒడిలో తప్పుల దిద్దుబాటుకు 21న ఆప్షన్లు - ammavodi scheme latest news
'జగనన్న అమ్మఒడి' పథకంలో తప్పుగా నమోదైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతా, ఐఎఫ్‌ఎస్‌సీ, ఆధార్ నంబర్లను సరిదిద్దేందుకు 21వ తేదీన ఆప్షన్లు ఇవ్వనున్నారు.
ammavodi-re-correstions-options-start-from-21of-this-month