ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆకలితో అలమటిస్తున్న వారికి.. అమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ చేయూత - అమ్మ ఛారిటబుల్ ట్రస్టు వార్తలు

కరోనా వ్యాప్తి దృష్ట్యా దేశమంతటా లాక్‌డౌన్‌ అమల్లో ఉంది. ఈ క్రమంలో గుంటూరులో ఆహారం దొరక్క ఇబ్బందులు పడుతున్న అనేక మందికి భోజనం అందిస్తున్నారు అమ్మ ఛారిటబుల్ ట్రస్టు సభ్యులు. ఈటీవీ భారత్, ఈనాడులో వచ్చిన కథనానికి అమెరికాలో ఉన్న అఖిల్ తన వంతు సాహాయం చేసేందుకు ముందుకొచ్చారు.

amma-trust-helping-to-poor-people-in-guntur
amma-trust-helping-to-poor-people-in-guntur

By

Published : Apr 17, 2020, 10:16 PM IST

ఆకలితో అలమటిస్తున్న వారికి.. అమ్మ ఛారిటబుల్ ట్రస్టు చేయూత

కరోనా లాక్ డౌన్ సందర్భంగా గుంటూరులో ఆహారం దొరక్క ఇబ్బందులు పడుతున్న వారికి అమ్మ ఛారిటబుల్ ట్రస్టు తరపున భోజనం పెడుతున్నారు. వీటికోసం గుంటూరు జిల్లా మోతడక గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ నిమ్మగడ్డ అఖిల్ లక్ష రూపాయల విరాళం అందించారు. అమెరికాలో ఉంటున్న అఖిల్ తన తండ్రి హనుమంతరావు ద్వారా ట్రస్టు నిర్వాహకులకు నగదును అందించారు. రోజువారి కూలీలు, బిచ్చగాళ్లు, లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. వారిని ప్రభుత్వం పునరావాస కేంద్రాల్లో ఉంచింది. వీరికి అమ్మ ఛారిటబుల్ ట్రస్టు ఆహారం అందిస్తోంది. ఈ విషయంపై ఈటీవీ భారత్, ఈటీవీ, ఈనాడులో వచ్చిన వార్తలు చూసి.. అమెరికాలో ఉన్న అఖిల్ తన వంతు సాహాయం చేసేందుకు ముందుకొచ్చారు.

ABOUT THE AUTHOR

...view details