గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్ గా నిర్ధరణైంది. మహిళను కాటూరి ఆసుపత్రికి తరలించేందుకు తొలుత కుటుంబ సభ్యులు అంగీకరించారు. వైద్య సిబ్బంది 108 వాహనంలో ఎక్కించుకొని ఆసుపత్రికి వెళ్తుండగా.. బాధితురాలి కుటుంబ సభ్యులు డీఎంహెచ్ఓకి ఫోన్ చేసి ఆమెను ఆసుపత్రికి తరలించవద్దని ఇంటి దగ్గరే జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పారు.
కరోనా వచ్చిందని అంబులెన్స్ ఎక్కించారు... వద్దన్నారని మధ్యలోనే వదిలేశారు... - గుంటూరు జిల్లాలో రోడ్డుపైనే కరోనా బాధితురాలు వార్తలు
కరోనా సోకిన ఓ బాధితురాలిని ఆసుపత్రికి తరలిస్తూ... ఫోన్ కాల్ రాగానే 108 వాహన సిబ్బంది ఆమెను అక్కడే దించేసి వెళ్లిన ఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో చోటు చేసుకుంది. దీంతో అక్కడ స్థానికులు ఆందోళన చెందారు.
రోడ్డుపైనే కరోనా బాధితురాలు
ఉన్నతాధికారుల నుంచి సమాచారం అందుకున్న అంబులెన్స్ సిబ్బంది.. మార్గ మధ్యలో గొట్టిపాడు వద్ద కరోనా బాధితురాలిని వదిలి వెళ్లారు. దిక్కులేని స్థితిలో కరోనా బాధితురాలు ఆటోలో ప్రత్తిపాడుకు చేరుకున్నారు. కరోనా వ్యాపిస్తోన్న నేపథ్యంలో అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి...