ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై సందిగ్ధత..!

అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. కరోనా వేళ భౌతికదూరం పాటిస్తూ సమావేశాల నిర్వహించటం కష్టతరమని అసెంబ్లీ వర్గాలు భావిస్తున్నాయి. సమావేశాలు లేకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కోసం మరోసారి ఆర్డినెన్స్ తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. దీనిపై గురువారం స్పష్టత వచ్చే అవకాశముంది.

ap assembly meetings
ap assembly meetings

By

Published : Jun 10, 2020, 3:02 PM IST

Updated : Jun 10, 2020, 3:24 PM IST

అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. భౌతికదూరం పాటిస్తూ సమావేశాల నిర్వహణపై సందేహాలు నెలకొన్నాయి. అసెంబ్లీ హాలులోని 175 స్థానాలకు 225 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో సీట్లో ఒక్కొక్కరిని కూర్చోబెట్టడం కష్ట సాధ్యమని అసెంబ్లీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. గవర్నర్ ప్రసంగ సమయంలో భౌతికదూరం ఏమాత్రం కుదరదని అంటున్నాయి. దీనితోపాటు నేతల బందోబస్తు కోసం 3 వేలమందికి పైగా పొలీసులు, ఇతర సిబ్బంది అవసరమని అంచనా. ఒకేచోట ఇంతమంది ఉంటే వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలు పాటించడం కష్టమని అధికారులు అంటున్నారు.

ఓటాన్​ అకౌంట్​కు మొగ్గు..?

శాసనసభ నిర్వహణ సమయంలో భౌతికదూరం కష్టసాధ్యమని భావిస్తున్న ప్రభుత్వం... సమావేశాలు లేకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కోసం మరోసారి ఆర్డినెన్స్ తెచ్చే యోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే 6 నెలల్లోపు తప్పనిసరిగా సమావేశాలను నిర్వహించాలన్న నిబంధన ఉందని శాసనసభ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో సమావేశాల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై గురువారం జరగనున్న మంత్రివర్గ భేటీలో చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై మంత్రివర్గ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇదీ చదవండి

రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారినెలా తొలగిస్తారు?: సుప్రీం

Last Updated : Jun 10, 2020, 3:24 PM IST

ABOUT THE AUTHOR

...view details