Ambedkar Study Circles Situation: పేదల చదువులపై ఎంతో శ్రద్ధ ఉన్నట్లు మాట్లాడే జగన్.. సాంఘిక సంక్షేమశాఖ స్టడీ సర్కిళ్ల ద్వారా అట్టడుగు వర్గాలైన ఎస్సీ, ఎస్టీలకు చెందిన పేద అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందే అవకాశాల్ని తగ్గించేశారు. ఎస్టీ, ఎస్టీలు పేదలు కాదనుకున్నారో ఏమో? ఆయనకే తెలియాలి. తొలి ఏడాది ఉచిత శిక్షణ మాటే ఎత్తలేదు. కరోనాతో మరో ఏడాది ముగిసిపోయింది. ఆ మరుసటి సంవత్సరమూ పట్టించుకోలేదు. గతేడాది ప్రారంభించినా.. నిబంధనలు తెచ్చి ఉచిత శిక్షణ కొన్నింటికే పరిమితం చేశారు. మొత్తంగా నాలుగేళ్ల అధికారంలో ఆయన శిక్షణ అందించింది ఒక్కసారే.
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ పేద విద్యార్థులకు పోటీ పరీక్షల్లో ఉచిత శిక్షణ ఇచ్చేందుకుగాను.. అంబేడ్కర్ స్టడీ సర్కిళ్లు విజయవాడ, విశాఖ, తిరుపతిలో 17 ఏళ్లుగా ఇవి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం ఏర్పడే వరకు ఏటా పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తూనే ఉన్నాయి. సివిల్ సర్వీసెస్, గ్రూప్-1, 2, 4, బ్యాంకు క్లర్క్, బ్యాంకు పీవో, రైల్వే గ్రూప్-డి, పంచాయతీ కార్యదర్శి, పోలీస్ కానిస్టేబుల్, వీఆర్‌వో, వీఆర్ఏ.. ఇలా పరీక్షల స్థాయితో సంబంధం లేకుండా ఎస్సీ, ఎస్టీల్లోని పేద విద్యార్థులకు ఉపయోగపడేలా ఉచిత శిక్షణ అందించాయి.
Avanigadda MRO Building in Dilapidated Condition.. జగనన్న..! అవనిగడ్డ కొత్త ఎమ్మార్వో కార్యాలయం ప్రారంభానికి అడ్డేంటన్న?
మూడు కేంద్రాల్లో పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చారు. జగన్ అధికారం చేపట్టగానే.. ఈ శిక్షణకు బ్రేక్ పడింది. తర్వాత అన్ని పోటీ పరీక్షలకు కాకుండా కేవలం ఒక్కో పరీక్షకు ఇచ్చే శిక్షణను.. ఒక్కో కేంద్రానికి పరిమితం చేశారు. విశాఖలో సివిల్ సర్వీసెస్‌కు, విజయవాడలో గ్రూప్-1 పరీక్షలకు, తిరుపతిలో బ్యాంకింగ్ ఉద్యోగాలకు శిక్షణ ఇచ్చేలా మార్పులు చేశారు. గత నాలుగేళ్లలో 2022లో ఒక బ్యాచ్‌కు మాత్రమే.. శిక్షణ ఇచ్చారు. తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు. తిరుపతి కేంద్రంలో గ్రూప్-2కు శిక్షణ అందిస్తామని వెల్లడించారు.
జగన్ ప్రభుత్వం 2019లో ఉచిత శిక్షణకు బడ్జెట్టే కేటాయించలేదు. కరోనా తదితర కారణాలతో 2020 నుంచి 2021 సెప్టంబరు వరకు స్టడీ సర్కిళ్లకు పట్టించుకోలేదు. పైగా పొరుగు సేవల సిబ్బందినీ తొలగించారు. 2005 నుంచి 2019 వరకు 1621మందికి వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ పొందారు. ఇందులో 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో 385 మంది శిక్షణ తీసుకున్నారు. 2014-19 మధ్య కాలంలో తిరుపతిలోని స్టడీ సర్కిల్‌లో బ్యాంకు పీవో, గ్రూప్-2 ప్రిలిమ్స్, డీఎస్సీ పరీక్షలకు 402 మంది శిక్షణ పొందగా 78 మంది ఉద్యోగాలు సాధించారు.
APSRTC Bus Charges Hike: ఏపీఆర్టీసీలో రాయితీల కోత.. ప్రయాణికులపై ఛార్జీల మోత..
జగన్ ప్రభుత్వం వచ్చాక 2022లో విజయవాడ కేంద్రంలో 100 మందికి గ్రూప్-1.. తిరుపతిలో రెండు విడతలుగా బ్యాంకు పీవో శిక్షణ ఇచ్చినట్లు సాంఘిక సంక్షేమశాఖ అధికారులు తెలిపారు. అద్దె భవనంలో కొనసాగుతున్న విశాఖ స్టడీ సర్కిల్‌కు సొంత భవనాన్ని ఏర్పాటు చేసేందుకు.. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం రుషికొండ వద్ద స్థలాన్ని కేటాయించింది. నిర్మాణానికి అప్పటిమంత్రి పుష్పరాజ్.. శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 2009లో కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పటిమంత్రిగా పనిచేసిన పిల్లి సుభాష్‌చంద్రబోస్ మళ్లీ.. శంకుస్థాపన చేసినా నిర్మాణం అటకెక్కింది.
రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ ప్రభుత్వం నాలుగున్నర కోట్ల రూపాయలు కేటాయించి 2019నాటికి భవన నిర్మాణం పూర్తి చేసింది. ఎన్నికల ముందు అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొత్తం నిర్మాణం తామే చేసినట్లు చెప్పుకునే ప్రయత్నం చేసింది. టీడీపీ హయాంలో నిర్మించి.. ప్రారంభించిన భవనాన్ని.. 2022లో మంత్రి మేరుగు నాగార్జున మళ్లీ ప్రారంభించారు. ప్రస్తుతం విశాఖ అంబేడ్కర్ స్టడీ సర్కిల్‌లో పరిస్థితులు దయనీయంగా మారాయని.. ఎస్సీ, ఎస్టీ సంఘాలు మండిపడుతున్నారు.
UnderGround Drainage Works: ఏపీలో పడకేసిన పారిశుద్ధ్యం.. యూజీడీకి మంగళం పాడేసిన వైసీపీ సర్కార్..
Ambedkar Study Circles అంబేడ్కర్ స్టడీ సర్కిళ్లపై ఎందుకంత కోపం!