అంబేడ్కర్ ఆశయాలను వైకాపా ప్రభుత్వం తుంగలో తొక్కిందని తెదేపా నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు విమర్శించారు. ఆయన కలలు కన్న సామాజిక న్యాయం తెదేపాతోనే సాధ్యమని అన్నారు.
అంబేడ్కర్ ఆశయాలను వైకాపా తుంగలో తొక్కింది: తెదేపా - నరసరావుపేట తెదేపా కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు
అంబేడ్కర్ ఆశయాలు తెదేపాతోనే సాధ్యమని ఆ పార్టీ నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అన్నారు. స్థానిక తెదేపా కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. వైకాపా ప్రభుత్వం అంబేడ్కర్ ఆశయాలను తుంగలో తొక్కిందని ఆరోపించారు.
నరసరావుపేట తెదేపా కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు
నరసరావుపేట తెదేపా కార్యాలయంలో నిర్వహించిన అంబేడ్కర్ 130వ జయంతి వేడుకల్లో జీవీ ఆంజనేయులు పాల్గొని మాట్లాడారు. నవభారత నిర్మాణం కోసం అంబేడ్కర్ ఎనలేని కృషి చేశారని చెప్పారు. పేద విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదవుకునేలా చంద్రబాబు వారికి రూ. 10 లక్షలు ఇస్తే.. వైకాపా ప్రభుత్వం ఆ పథకాన్ని ఎత్తేసిందని విమర్శించారు. సంక్షేమ పథకాల్ని అటకెక్కించడం హేయమైన చర్య అని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి:గుంటూరు జిల్లా వ్యాప్తంగా... ఘనంగా అంబేడ్కర్ జయంతి