ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరులో అంబేడ్కర్ వర్ధంతి.. నేతల నివాళులు

గుంటూరు జిల్లాలో.. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ వర్ధంతి నిర్వహించారు. పార్టీల నేతలు రాజ్యాంగ నిర్మాతకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పేదలు, బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేడ్కర్ నిర్విరామంగా కృషి చేశారని కొనియాడారు.

నివాళులర్పించిన పలు పార్టీల నేతలు
నివాళులర్పించిన పలు పార్టీల నేతలు

By

Published : Dec 6, 2020, 3:40 PM IST

భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెల కిశోర్ బాబు ప్రత్తిపాడు, కాకుమాను, పెదనందిపాడు, వట్టిచెరుకూరు మండలాల్లో పర్యటించి అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగాన్ని అనుసరించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పని చేయాలన్నారు.

అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అనుసరించకుండా.. జగన్ సొంత రాజ్యాంగంతో పాలన సాగిస్తున్నారని తెదేపా నేతలు దుయ్యబట్టారు. గుంటూరులో నిర్వహించిన అంబేడ్కర్ వర్ధంతిలో మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు, మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అహ్మద్ నసీర్ మొహమ్మద్ పాల్గొన్నారు.

గుంటూరు లాడ్జి సెంటర్​లోని అంబేడ్కర్ విగ్రహానికి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేడ్కర్ సిద్ధంతాలను సీఎం జగన్ ముందుకు తీసుకెళ్తూ... సంక్షేమం - అభివృద్ధిని సమపాళ్ళలో అమలు చేస్తున్నారని కొనియాడారు.

ఇదీ చదవండి:

అణగారిన వర్గాలకు అంబేడ్కర్ చేసిన మేలు మరువలేనిది: అచ్చెన్నాయుడు

ABOUT THE AUTHOR

...view details