ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పవన్​కల్యాణ్... చంద్రబాబుకు దూత: అంబటి - ycp leaders comments chandrababu

చంద్రబాబు తన దూతగా... పవన్ కల్యాణ్​ను దిల్లీకి పంపించారని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో రాంబాబు మీడియాతో మాట్లాడారు.

అంబటి రాంబాబు

By

Published : Nov 15, 2019, 5:34 PM IST

అంబటి రాంబాబు

ముఖ్యమంత్రి జగన్​ను విమర్శించినందుకు పవన్​కల్యాణ్​కు ప్యాకేజీలు వస్తున్నాయని... వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. ఎవరి మత విశ్వాసాలు వారికి ఉంటాయని... దానిని అందరూ గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్... ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి చాలాసార్లు తిరుమలకు వెళ్లారని గుర్తుచేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్​కల్యాణ్... ఇసుక, ఆంగ్లమాధ్యమం నిర్ణయాలపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు తన దూతగా... పవన్ కల్యాణ్​ను దిల్లీకి పంపించారని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details