ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయని, ఈ సమయంలో ఆత్మస్థైర్యం దెబ్బతినేలా బాధ్యతారాహిత్యంగా ఎవరు వ్యవహరించినా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వైకాపా హెచ్చరించింది. తెదేపా సహా ఇతర పార్టీలు కొవిడ్ సమయంలో ప్రభుత్వానికి దన్నుగా నిలబడి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాలి గానీ... రాజకీయ లబ్ధి పొందేందుకు యత్నించడం దారుణమని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై తెదేపా తప్పుడు ప్రచారం చేయడం దారుణమన్నారు. విపత్కర పరిస్థితుల్లో చంద్రబాబు నీచంగా విమర్శించడం సరికాదని హితవు పలికారు. మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే కొవిడ్ రికవరీ రేట్ సహా వైద్యం అందించడం, టెస్టులు చేయడంలో ఏపీ అగ్రస్థానంలో ఉందన్నారు. సీఎం జగన్ ఎప్పటికప్పుడు సమీక్షలు చేసి తగు చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. వాక్సిన్లు తయారు చేయలేకపోవడం వల్లే వాక్సినేషన్ చేయలేకపోతున్నామని.. అవసరమైన డోసులు ఇస్తే కేవలం పదిరోజుల్లోనే అందరికీ వాక్సిన్లు వేసి చూపిస్తామన్నారు.
విపత్కర పరిస్థితుల్లోనూ రాజకీయాలేనా..?: అంబటి - Ambati Rambabu comments on tdp
కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో తెదేపా సహా ఇతర పార్టీలు రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నాయని.. వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా బాధ్యతారాహిత్యంగా ఎవరు వ్యవహరించినా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
అంబటి రాంబాబు