ఐటీ దాడులపై చంద్రబాబు ఎందుకు స్పందించడంలేదని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శే రూ.2 వేల కోట్ల వ్యవహారంలో కీలకంగా ఉంటే... అసలు వాళ్లని పశ్నిస్తే ఇంకెన్ని కోట్లు బయటపడతాయోనని అన్నారు. ఐటీ దాడుల్లో చంద్రబాబు, లోకేశ్ ప్రమేయంపై ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నందున వారిని కూడా ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. వ్యవస్థలను తప్పుదోవపట్టించడానికి చంద్రబాబు, లోకేశ్ ప్రయత్నిస్తున్నారని అంబటి ఆరోపించారు.
ఐటీ దాడులపై చంద్రబాబు స్పందించాలి: అంబటి - అంబటి తాజా వార్తలు
ఐటీ దాడులపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించాలని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శిపై జరిగిన ఐటీ సోదాల్లో రూ.2 వేల కోట్ల అవినీతి జరిగినట్టు ఆయన ఆరోపించారు. చంద్రబాబు, లోకేశ్‌ను ప్రశ్నిస్తే నిజాలు బయటపడతాయని పేర్కొన్నారు.
అంబటి రాంబాబు