అమరావతి రైతుల దీక్షలు 180వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు, దొండపాడు, మల్కాపురం, విజయవాడలోనూ మహిళలు ధర్నాలో పాల్గొన్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని నినాదాలు చేశారు. వైకాపా ప్రభుత్వం రాజధాని రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని రైతులు, మహిళలు డిమాండ్ చేశారు. పెంచిన పింఛన్, కౌలు డబ్బులు వెంటనే చెల్లించాలని రైతులు నినాదాలు చేశారు.
సడలని సంకల్పం.. ఏకైక రాజధానే లక్ష్యం - updates on amaravathi protest
అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న ధర్నా ఆదివారంతో ఆరు నెలలు పూర్తి చేసుకుంది. ఆరు నెలలు వాన, వరదలొచ్చినా.....మండుటెండలున్నా.... రైతులు ఎక్కడా అలసత్వం వహించలేదు. కరోనా వచ్చినా...సామాజిక దూరం పాటిస్తూ రైతులు, మహిళలు తమ ఇళ్ల వద్దే ఆందోళనలను కొనసాగించారు.
![సడలని సంకల్పం.. ఏకైక రాజధానే లక్ష్యం amaravthi farmers protest reached to 180 days](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7612065-302-7612065-1592142097894.jpg)
అమరావతి రైతుల దీక్ష