గాంధీజీ స్ఫూర్తితో అమరావతి పోరుబాటను కొనసాగిస్తామని గుంటూరు జిల్లా మందడంలోని మహిళలు స్పష్టం చేశారు. మహాత్ముడి వర్ధంతి సందర్భంగా మండల దీక్షా శిబిరంలో 10 మంది మహిళలు 12 గంటల నిరాహార దీక్షకు దిగారు. చరఖాతో నిరసన తెలిపారు. భారతీయ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బాపూజీ ఛాయాచిత్రాలను ప్రదర్శించారు. అమరావతి ఉద్యమాన్ని అహింస మార్గంలోనే కొనసాగిస్తామని మహిళలు అన్నారు. అమరావతి రైతులు దిల్లీ రైతుల స్థాయిలో ఉద్యమం చేసే దాకా తెచ్చుకోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
'అహింస మార్గంలోనే అమరావతి ఉద్యమం కొనసాగుతుంది' - గుంటూరు జిల్లా వార్తలు
గుంటూరు జిల్లా మందడంలో 10 మంది మహిళలు 12 గంటల నిరాహార దీక్షకు దిగారు. మహాత్ముడి వర్ధంతి సందర్భంగా చరఖాతో నిరసన తెలియజేశారు. అమరావతి ఉద్యమాన్ని అహింస మార్గంలోనే కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
అమరావతి ఉద్యమం