Amaravati Women Farmers: ప్రభుత్వానికి భూములు ఇస్తే తమను విచారణ పేరుతో న్యాయస్థానాల్లో చుట్టూ తిప్పుతున్నారంటూ.. అమరావతి మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి ఉద్యమంలో భాగంగా మందడం కూడలిలో ధర్నాలో పాల్గొన్న మహిళలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో 14 మందిపై కేసులు పెట్టారు. వీరిలో ఒకరు మృతి చెందగా.. మిగిలిన 13 మంది మంగళగిరి న్యాయస్థానానికి హాజరయ్యారు. జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ కోర్టులో విచారణకు పాల్గొన్నారు. ఎప్పుడూ ఇంటికి పరిమితమైన తమను ఈ ప్రభుత్వం ఉద్యమంలో పాల్గొనేలా చేసిందని మహిళలు చెప్పారు. తమ ఆకాంక్ష కోసం ఉద్యమం చేస్తే.. ప్రభుత్వం తమపై కేసులు నమోదు చేసి కోర్టుకు ఈడ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.
రాజధాని కోసం భూములిస్తే.. కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు: అమరావతి మహిళా రైతులు - Amaravati farmers fire on jagan
Amaravati Women Farmers attend court: ప్రభుత్వానికి భూములిస్తే తమను విచారణ పేరుతో న్యాయస్థానాల చుట్టూ తిప్పుతున్నారంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి ఉద్యమంలో మందడం కూడలి వద్ద ధర్నాలో పాల్గొన్న వారిలో, 14మంది మహిళలకు పోలీసులు నోటీసులు అందజేశారు. వారిలో ఒకరు మృతి చెందగా.. మిగిలిన 13 మంది మంగళగిరి న్యాయస్థానానికి హాజరయ్యారు.
Amaravati Women Farmers