మూడు రాజధానులను నిరసిస్తూ అమరావతి ప్రాంతంలో రైతులు, మహిళలు 622వ రోజు ఆందోళనలు కొనసాగించారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, ఉద్ధండరాయునిపాలెం, అనంతవరం, నెక్కల్లు, దొండపాడు, కృష్ణాయపాలెంలో రైతులు నిరసన దీక్షలు చేపట్టారు. కృష్ణాష్టమిని పురస్కరించుకొని రాజధాని దీక్షా శిబిరాల్లో కిట్టయ్యలు సందడి చేశారు. వెలగపూడి, మోతడక, తుళ్లూరులో చిన్నారులకు కన్నయ్య వేషాలు వేసి దీక్షలో కూర్చొబెట్టారు. రైతులతో కలసి రాధాకృష్ణులు 'జై అమరావతి' అంటూ నినదించారు. అనంతరం దీక్షా శిబిరంలోనే చిన్నారులతో ఉట్టి కొట్టించారు.
బొత్సపై చర్యలకు..