ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఐఆర్ఆర్ కేసు - చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ విచారణ వాయిదా

Amaravati Inner Ring Road Case Adjourned in AP HC: ఏపీ సీఐడీ నమోదు చేసిన ఇన్నర్​ రింగ్​ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పిటిషన్​ విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వ తరఫున న్యాయవాదుల అభ్యర్థన మేరకు విచారణను వాయిదా వేసింది.

amaravati_inner_ring_road_case_adjourned_in_ap_hc
amaravati_inner_ring_road_case_adjourned_in_ap_hc

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 13, 2023, 9:09 PM IST

Amaravati Inner Ring Road Case Adjourned in AP HC: అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్​ కేసులో ముందస్తు బెయిల్​ మంజూరు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్​ను హైకోర్టు విచారించింది. ఈ కేసులో ఇప్పటికే ప్రభుత్వం తరఫున ఏజీ పొన్నవోలు శ్రీరామ్​ మంగళవారం రోజున పలు వాదనలు వినిపించారు. అంతేకాకుండా పిటిషనర్​ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే విచారణ బుధవారానికి వాయిదా పడగా, ప్రభుత్వం తరపున న్యాయవాదులు వాదనలు వినిపించడానికి మరింత సమయం కావాలని న్యాయస్థానాన్ని కోరారు. వారి అభ్యర్థనను స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

అమరావతి రాజధాని ఇన్నర్​ రింగ్​ రోడ్డు కేసులో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఫిర్యాదులపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చింది. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఆయన కుటుంబానికి చెందిన హెరిటేజ్​ సంస్థకు మేలు చేసేలా ఐఆర్​ఆర్​ అలైన్​మెంట్​లో మార్పు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ​అంతేకాకుండా మాజీ మంత్రి నారాయణ కూడా ఈ అంశంలో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రోజుల్లోనే గ్రీన్‌ఫీల్డ్ రాజధానికి సంబంధించి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు తెర లేపారని విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో నారాయణ హైకోర్టును ఆశ్రయించారు.

వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టిక్కెట్లు వస్తాయి - ఆ దిశగా టీడీపీ, జనసేన శ్రేణులు సిద్ధం కావాలి : చంద్రబాబు

ఈ కేసుపై టీడీపీ ఇప్పటికి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అసలే వేయని, నిర్మించని రోడ్డులో అక్రమాలు జరగడం ఏంటనీ ప్రశ్నిస్తోంది. కనీసం భూ సేకరణ కూడా జరగలేదని, అటువంటి దానిలో అవినీతి ఎలా సాధ్యమని టీడీపీ నిలదీస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ ఉన్న సమయంలో, అమరావతికి 30 కిలోమీటర్లు దూరంలో హెరిటేజ్​ సంస్థ భూ కొనుగోలు నిర్ణయం తీసుకుంటే అవినీతి ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నిస్తోంది.

యానాదుల్ని, వారి పిల్లల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాదే: చంద్రబాబు నాయుడు

Chandrababu Fiber Net Case: ఫైబర్‌ నెట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు మంగళవారం విచారించిన విషయం తెలిసిందే. ఆయితే ఈ కేసును పలు కారణాల దృష్ట్యా, ఫైబర్‌ నెట్‌ కేసును జనవరి 17కు వాయిదా వేసిన విషయం విధితమే. అప్పటి వరకూ ఈ కేసు అంశలపై ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని దేశోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ప్రభుత్వంతో పాటు చంద్రబాబు సైతం ఈ నియామాలు పాటించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసు విషయంలో సంయమనం పాటించాలని ఇరువర్గాలకు సుప్రీం కోర్టు సూచించింది.

ఫైబర్‌ నెట్‌ కేసు - చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జనవరి 17కు వాయిదా

ABOUT THE AUTHOR

...view details