ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాగడాలతో రాజధాని రైతుల ర్యాలీ - amaravati farmers protest on five years of foundation stone

అమరావతిని రాజధానిగా ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది పరిస్థితి. ఆ ప్రాంత రైతులు, మహిళలు దాదాపు సంవత్సరం నుంచి దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. శంకుస్థాపన చేసి ఐదేళ్లు దాటగా.. రాజధాని గ్రామాల ప్రజలు కాగడాలతో నిరసనకు దిగారు.

torch rally in amaravati
కాగడాలతో నిరసన తెలుపుతున్న అమరావతి రైతులు, మహిళలు

By

Published : Oct 23, 2020, 9:03 AM IST

రాజధానికి శంకుస్థాపన చేసి ఐదేళ్లు పూర్తికావడంతో.. అమరావతి ప్రాంత రైతులు, మహిళలు కాగడాల ర్యాలీ నిర్వహించారు. 'అమరావతి వెలుగు' పేరిట ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో.. మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు మండలాల ప్రజలు పాలుపంచుకున్నారు.

ఉద్ధండరాయునిపాలెంలోని రైతులు గురువారం వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రికి కాగడాల ర్యాలీతో హోరెత్తించారు. మోదీ మాస్కు ధరించి.. 'జై అమరావతి' అంటూ నినాదాలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details