పరిపాలన వికేంద్రీకరణను నిరసిస్తూ అమరావతి పరిధిలో రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలు పండుగపూట కూడా కొనసాగించారు. నేటితో ఈ నిరసనలు 393వ రోజుకు చేరాయి. అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు.
పండుగ రోజూ పట్టు వదలకుండా... అమరావతి రైతుల దీక్ష
మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతుల నిరసన దీక్షలు పండుగ రోజు కూడా కొనసాగించారు. ఏకైక రాజధానిగా అమరావతే కావాలని ఫ్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.
రైతుల దీక్ష
ఉద్ధండరాయునిపాలెంలో పళ్లు, ఫలహారాలతో మహిళలు, రైతులు పూజలు నిర్వహించారు. తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద గోదాదేవి రంగనాథ స్వామి వారి కళ్యాణం చేశారు.
ఇదీ చదవండి:ఓహో భోగి మంటలు ఇందుకోసమేనా..!