ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Amaravati farmers protest: అమరావతిని ముక్కలు చేసేందుకే.. తెరపైకి ఆ అంశం: రాజధాని రైతులు

Amaravathi farmers protest: అమరావతే రాజధానిగా కొనసాగాలంటూ.. రైతులు, మహిళలు 753వ రోజూ ఆందోళనలు చేపట్టారు. 29 గ్రామాలను కలిపే కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

amaravathi farmers protest on 753rd day
రాజధాని రైతుల ఆందోళనలు

By

Published : Jan 8, 2022, 9:13 PM IST

Amaravathi farmers protest: పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ.. రైతులు, మహిళలు 753వ రోజూ ఆందోళనలు చేపట్టారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, పెదపరిమి, వెంకటపాలెం గ్రామాల్లో.. రైతులు నిరసనలు కొనసాగించారు. అమరావతే రాజధానిగా కొనసాగాలంటూ మందడంలో మహిళలు.. శ్రీచక్ర పూజ నిర్వహించారు. పాదయాత్రలో ముందుండి నడిపించిన వేంకటేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు.

మూడు రాజధానుల తీరులానే.. అమరావతిని ముక్కలు చేసేందుకు మున్సిపల్‌ కార్పొరేషన్‌ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని రైతులు ఆరోపించారు. 29 గ్రామాలను కలిపే కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇందులో మరో ఆలోచన లేదని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details