పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ 29 గ్రామాల్లోనూ రైతులు 256వ రోజు ఆందోళనలు కొనసాగించారు. మంగళగిరి మండలం ఎర్రబాలెం, నీరుకొండ, నిడమర్రు, బేతపూడి, నవులూరు, కృష్ణాయపాలెం, తుళ్లూరు మండలం మందడం, వెలగపూడి, ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం, పెదపరిమి, అబ్బిరాజుపాలెం, తాడేపల్లి మండలం ఉండవల్లి, పెనుమాక రైతులు దీక్షలో పాల్గొన్నారు. ఉద్దండరాయునిపాలెంలో మహిళలు హనుమాన్ చాలీసా చదువుతూ నిరసన తెలిపారు. మూడు రాజధానులు వద్దని వెలగపూడిలో రైతులు నినాదాలు చేశారు. అభిరాజుపాలెంలో మహిళలు హోమం నిర్వహించారు.
256వ రోజూ రాజధాని రైతుల ఆందోళనలు - three capitals for ap
రాజధాని అమరావతి ప్రాంతంలో 256వ రోజూ ఆందోళనలు కొనసాగాయి. ఉద్దండరాయునిపాలెంలో మహిళలు హనుమాన్ చాలీసా చదువుతూ నిరసన తెలిపారు.
Amaravati