అంబులెన్స్‌లను రాష్ట్ర సరిహద్దుల్లో ఆపేసిన కేసీఆర్ ప్రభుత్వం.. ఏపీ సీఐడీ పోలీసుల వాహనాలకు అనుమతి ఎలా ఇచ్చిందని రాజధాని రైతులు ప్రశ్నించారు. ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టును నిరసిస్తూ.. రాజధాని గ్రామాల్లో రైతులు, మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. తుళ్లూరులో మహిళలు నల్ల బెలూన్లతో నిరసన తెలిపారు. నెక్కల్లు, మందడం, వెలగపూడి, బోరుపాలెంలో రైతులు, మహిళలు ఎంపీకి మద్దతుగా నినాదాలు చేశారు.
ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టుపై అమరావతి రైతుల ఆందోళన - ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టుపై నిరసన
అమరావతి రైతుల ఆందోళనలు 515వ రోజూ కొనసాగాయి. ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టును నిరసిస్తూ.. రాజధాని గ్రామాల్లో మహిళలు, రైతులు ఆందోళనకు దిగారు. ప్రశ్నించే వారిని ప్రభుత్వం అరెస్ట్ చేస్తోందని విమర్శించారు.
![ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టుపై అమరావతి రైతుల ఆందోళన amaravati farmers protests](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11769305-492-11769305-1621074802361.jpg)
515వ రోజుకి అమరావతి రైతుల ఆందోళన
అమరావతి రైతుల నిరసనలు
అమరావతి ఉద్యమానికి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మద్దతు పలికినందుకే.. ఆయనను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని రాజధాని రైతులు ఆరోపించారు. ప్రశ్నించే వాళ్లను ప్రభుత్వం అన్యాయంగా అరెస్టు చేస్తోందని విమర్శించారు. ఇంటింటికీ రేషన్ పంపిణీకి బదులు.. ప్రజలకు కరోనా టీకా వేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: