భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతి వనాన్ని రాజధానిలోనే ఏర్పాటు చేయాలని అమరావతి దళిత రైతులు డిమాండ్ చేశారు. స్మృతి వనాన్ని గుంటూరుకు తరలించాలన్న ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శాఖమూరు వద్ద ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. స్మృతి వనాన్ని రాజధాని నుంచి తరలిస్తే ప్రాణత్యాగానికైనా వెనుకాడబోమని తేల్చిచెప్పారు. ముందుగా ప్రకటించినట్లే 125 అడుగుల విగ్రహాన్ని నిర్మించాల్సిందేనని స్పష్టం చేశారు. ముందు ఇక్కడ విగ్రహం నిర్మించిన తర్వాతే మీకు నచ్చినచోట ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. దళితుల మనోభావాలు దెబ్బతీయకుండా ప్రభుత్వం వ్యవహరించాలని కోరారు.
'అంబేడ్కర్ స్మృతి వనాన్ని రాజధానిలోనే నిర్మించాలి'
రాజధానిలోనే అంబేడ్కర్ స్మృతి వనాన్ని నిర్మించాలంటూ అమరావతి దళిత రైతులు డిమాండ్ చేశారు. ముందు ఇక్కడ నిర్మించాకే ఆ మహాత్ముని విగ్రహాన్ని మీకు నచ్చినచోట నిర్మించుకోవాలంటూ నినదించారు. దళితుల మనోభావాలను దెబ్బతీయోద్దంటూ హెచ్చరించారు.
రాజధానిలోనే అంబేడ్కర్ స్మృతి వనాన్ని నిర్మించాలంటూ దళిత రైతులు ఆందోళన