ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ముందు అభివృద్ధి చేయండి.. ఆ తర్వాతే పేదలకు ఇళ్ల స్థలాలివ్వండి' - ఆంధ్రప్రదేశ్ వార్తలు

Capital Amaravati Farmers Dharna: అమరావతిలో తమ ప్లాట్లను అభివృద్ధి చేసిన తర్వాతే.. పేదలకు ఇళ్ల స్థలాలివ్వాలని రాజధాని రైతులు డిమాండ్ చేశారు. కృష్ణాయపాలెంలో పేదలకు ఇస్తామన్న స్థలాల వద్ద.. ధర్నా చేపట్టిన రాజధాని రైతులు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Farmers Dharna
రైతుల ధర్నా

By

Published : Apr 10, 2023, 1:35 PM IST

Capital Amaravati Farmers Dharna: రాజధాని అమరావతిలో ప్రభుత్వం తమకు ఇచ్చిన ప్లాట్లను అభివృద్ధి చేసిన తర్వాతే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజధానిని అభివృద్ధి చేయలేని సీఎం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీఆర్​డీఏ చట్టం ప్రకారం ఏ కార్యక్రమం చేపట్టినా రైతులను భాగస్వామ్యం చేయాలని స్పష్టంగా ఉందని రైతులు చెప్పారు. అంతేకానీ సీఆర్డీఏ చట్టంలో మార్పులు చేసి ఆర్​5 జోనే ఏర్పాటుచేసి.. అందులోని భూములను పేదలకు ఊరుకోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భాగస్వామ్యం లేకుండా పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఈ పోరాటంలో తమ ప్రాణాలు పోయినా సరే వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని తెగేసి చెప్పారు.

అసలు ఏంటీ ఆర్​5 జోన్:అమరావతి మాస్టర్ ప్లాన్‌ను సవరించవద్దని హైకోర్టు చెప్పినా ప్రభుత్వం మాత్రం దాన్ని సవరిస్తూ ఆర్-5 జోన్ పేరిట కొత్త నివాస ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తూ కొద్దిరోజుల గెజిట్ నోటిఫికేషన్‌ జారీ చేసింది. మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, తూళ్లురు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలోని 900 ఎకరాలతో R5 జోన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

మాస్టర్‌ ప్లాన్‌లో మార్పులు చేసేందుకు వీలుగా సీఆర్​డీఏ చట్టాన్ని సవరిస్తూ 2022 అక్టోబర్‌ 18న ప్రభుత్వం జీవో విడుదల చేసింది. రాజధాని పరిధిలోని స్థానిక సంస్థలు, ఎన్నికైన పాలకమండళ్లు లేకపోతే.. ప్రత్యేక అధికారుల ద్వారా లేదంటే పర్సన్‌ ఇంఛార్జ్‌ల ద్వారా గానీ.. లేదంటే ప్రభుత్వం అయినా సరే మాస్టర్‌ ప్లాన్‌లో మార్పులు చేసేలా సీఆర్​డీఏ చట్టాన్ని సవరించింది. ప్రత్యేక అధికారులతో తీర్మానాలు చేయించి గత ఏడాది అక్టోబర్‌లో.. ముసాయిదా ప్రకటన విడుదల చేసింది. దానిపై అప్పట్లోనే రైతులు హైకోర్టును ఆశ్రయించారు. స్టే ఇవ్వాలని కోరారు. కోర్టుకు తెలియకుండా గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వమని అప్పట్లో ప్రభుత్వం చెప్పింది. కానీ తరువాత మాత్రం అందుకు విరుద్ధంగా నోటిఫికేషన్ జారీ చేసింది.

రోడ్లు, వసతులు కల్పించాలంటూ.. అమరావతి రైతుల ధర్నా

"ఇక్కడ మాకు ఇచ్చిన ప్లాట్లను డెవలప్మెంట్ చేసి.. డ్రైనేజీ, కరెంటు మొత్తం ఇచ్చిన తరువాత.. ప్లాట్లు అన్నీ అయిపోగా మిగిలిన దానిని పేదలకు ఇవ్వాలని చెప్పాం. కానీ మాకు ఏం లేకుండా, రోడ్లు లేకుండా పేదవారికి ఎలా ఇస్తారు. ఇలా ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తారు. గతంలో కూడా ఇచ్చారు. అప్పుడు కోర్టులో కేసు వేశాం. మళ్లీ ఇప్పుడు ఇస్తున్నారు. ఎన్నిసార్లు మోసం చేస్తారు". - అమరావతి రైతు

"జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాం.. ఆ రోజు ఉన్న సీఆర్​డీఏ చట్టం ప్రకారం మీరు ఏదైనా చేయండి. కానీ మీరు కొత్త కొత్త జీవోలు తీసుకొచ్చి.. రైతులందరినీ మోసం చేసి.. ఈ ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాన్ని నాశనం చేస్తామంటే మాత్రం మీకు గుణపాఠం చెబుతాం. దీని కోసం మా ప్రాణాలు అయినా సరే ఇస్తాం. రైతులను అన్యాయం మాత్రం చేయద్దు. - అమరావతి రైతు

"మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఇక్కడ మూడు రాజధానులు పెడతాం అని అనలేదు. ఇక్కడ నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాం అని మాకు చెప్పలేదు. సీఆర్​డీఏ ప్రకారం గత ప్రభుత్వానికి మేము భూములు ఇచ్చిన మాట వాస్తవం. కానీ ఇప్పటి వరకూ మా ప్లాట్లు డవలప్​ చేయకుండా.. ఎక్కడో ఉన్నవారికి ప్లాట్లు ఇస్తాం ఎంటే ఎలా. గత ప్రభుత్వంలో రోడ్లు వేస్తే.. మీ ప్రభుత్వం వచ్చిన తరువాత రోడ్లు తవ్వుకొని వెళ్లారు". - అమరావతి రైతు

"రాజధానిని నాశనం చేయడానికి ఈయన నానా రకాలుగా తంటాలు పడుతున్నారు. కొత్తగా బయట నుంచి పేదలను తీసుకొచ్చి ఏదో చెయాలనుకుంటున్నారు. మరి వైజాగ్​లో ఇవ్వచ్చుగా, కర్నూలులో ఇవ్వచ్చుగా. కేవలం అమరావతిలోనే ఎందుకు ఇస్తున్నారు. ముందు ఇక్కడ డెవలప్మెంట్ చేయమని చెప్పండి. 1200 రోజులుగా మమ్మల్ని పట్టించుకనే వారే లేరు". -అమరావతి రైతు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details