తుళ్లూరులో రాజధాని రైతుల ఆందోళనలు 42వ రోజుకు చేరుకున్నాయి. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. కర్షకులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ ఆందోళనలు పట్టించుకోకుండా అమరావతిపై మెుండి వైఖరి ప్రదర్శించడం దారుణమని అన్నారు. సర్కారు 13 జిల్లాల అభివృద్ధే తమకు ముఖ్యమని చెబుతున్నా... అమరావతిపై కక్ష పెంచుకోవటమే కనిపిస్తుందని అన్నదాతలు మండిపడ్డారు. గాంధీజీ సూచించిన సత్యం, అహింస బాటలోనే తమ నిరసనలు తెలియజేస్తామని స్పష్టం చేశారు. వికేంద్రీకరణ బిల్లుకు శాసనమండలి అడ్డు పడుతుందనే ఉద్దేశంతోనే రద్దు చేశారని విమర్శించారు.
'రాజధానిగా అమరావతి సాధనే.. మా ఏకైక లక్ష్యం' - అమరావతి రైతుల ఆందోళనలు
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ..తుళ్లూరులో రైతుల ఆందోళనలు 42వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా... గాంధీజీ సూచించిన సత్యం, అహింస బాటలోనే తమ నిరసనలు తెలియజేస్తామని స్పష్టం చేశారు.
'రాజధానిగా అమరావతి సాధనే..మా ఏకైక లక్ష్యం'