ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'బిల్లులకు ఆమోదం తెలిపితే... కారుణ్య మరణాలకు అనుమతివ్వండి' - అమరావతిపై వార్తలు

రైతుల త్యాగాలు, మహిళల కన్నీళ్లను గవర్నర్ పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు అమరావతి పరిరక్షణ సమితి మహిళా ఐకాస సభ్యులు కోరారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్‌ ఆమోదం తెలిపితే.. కారుణ్యమరణాలకు అనుమతి ఇవ్వాలన్నారు.

amaravathi women jac members
అమరావతి పరిరక్షణ సమితి మహిళా ఐకాస సభ్యులు

By

Published : Jul 24, 2020, 4:18 PM IST

రాజధాని వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్‌ ఆమోదం తెలిపితే.. అది అమరావతి ప్రజలకు మరణశాసనం రాసినట్టే అవుతుందని అమరావతి పరిరక్షణ సమితి మహిళా ఐకాస పేర్కొంది. అమరావతి రాజధాని కాకుంటే... కారుణ్యమరణాలకు అయినా అనుమతి ఇవ్వాలని ఐకాస సభ్యులు కోరారు. రైతుల త్యాగాలు, మహిళల కన్నీళ్లను గవర్నర్ పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ బిల్లులను గవర్నర్‌ ఆమోదించకుండా.. రాష్ట్రపతికి పంపాలని విజ్ఞప్తి చేశారు.

రాజధాని ప్రాంతంలో నివసించే ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదని.. కౌలు ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు పెడుతుందని ఐకాస సభ్యలు అన్నారు. 220 రోజులుగా అమరావతి కోసం ఉద్యమం చేస్తున్నామని.. లాక్ డౌన్ నిబంధనలను పాటిస్తూనే తమ పోరాటం కొనసాగిస్తున్నామన్నారు. కేంద్రం ప్రభుత్వం జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు.

ఇదీ చదవండి: గవర్నర్​ ఆదేశాలిచ్చినా పోస్టింగ్ ఇవ్వకపోవటం దారుణం:సుప్రీం

ABOUT THE AUTHOR

...view details