రాజధాని అమరావతి ఉద్యమం 222 రోజులకు చేరిన సందర్భంగా గుంటూరు చంద్రమౌళినగర్లో రైతులు, మహిళలు పోరాట దీక్షలు నిర్వహించారు. కరోనా కారణంగా భౌతిక దూరం పాటిస్తూనే తమ నిరసన గళాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి వినిపించే ప్రయత్నం చేశారు.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ఈ దీక్షలను ప్రారంభించారు. భూములిచ్చి మోసపోయామని... 3 రాజధానుల పేరుతో తమ జీవితాలను ముక్కలు చేయవద్దంటూ రాజధాని రైతులు, మహిళలు వేడుకున్నారు. తమ బతుకు, భవిష్యత్తు ముడిపడి ఉన్న అమరావతి కోసం ఎన్నాళ్లయినా.. ఎన్నేళ్లయినా పోరాడతామని స్పష్టం చేశారు. అలుపెరుగని పోరాటంతో ప్రభుత్వానికి ఇకనైనా కనువిప్పు కలగాలని.. రాజధానిగా అమరావతినే కొనసాగిస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటన చేయాలని ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.