ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు 304వ రోజు ఆందోళనలు నిర్వహించారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, ఐనవోలు, అనంతవరం, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, బోరుపాలెం, అబ్బరాజు పాలెం గ్రామాల్లో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు. తుళ్లూరు, లింగాయపాలెంలో మహిళలు పారాయణం చేస్తూ నిరసనలో పాల్గొన్నారు. మూడు రాజధానులు వద్దు...పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. అమరావతి మునిగిపోతోందంటూ వైకాపా నేతలు చేస్తున్న ప్రచారాన్ని రైతులు ఖండించారు.
304వ రోజుకి చేరిన అమరావతి ఉద్యమం - అమరావతి ఉద్యమంపై వార్తలు
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతుల ఉద్యమం 304వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని నిరసనకారులు స్పష్టం చేశారు.
304వ రోజుకి చేరిన అమరావతి ఉద్యమం