సకల జనుల సమ్మెలో భాగంగా తాడేపల్లి మండలం ఉండవల్లిలో రైతులు ధర్నా నిర్వహించారు. బ్యాంకులు, పాఠశాలలు, ఇతర వాణిజ్య సముదాయాలను మూయించారు. ఉండవల్లి కూడలిలో మానవహారం నిర్వహించారు. మంత్రి మోపిదేవి ఇంటిని ముట్టడించేందుకు యత్నించిన రైతులు, రైతు కూలీలను పోలీసులు అడ్డుకున్నారు. సచివాలయం, అసెంబ్లీ ఇక్కడే ఉంటుందనే ఆశతో భూములు ఇచ్చామని... ఇప్పుడు ప్రభుత్వం వాటిని మారిస్తే తమకు అక్కడే స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఉండవల్లిలో రైతుల ధర్నా... అడ్డుకున్న పోలీసులు - అమరావతి కోసం ఆందోళనలు
సకల జనుల సమ్మెలో భాగంగా తాడేపల్లి మండలం ఉండవల్లిలో రైతులు ధర్నా నిర్వహించారు. మంత్రి మోపిదేవి ఇంటిని ముట్టడించేందుకు యత్నించిన రైతులు, కూలీలను పోలీసులు అడ్డుకున్నారు.
ఉండవల్లిలో సకల జనుల సమ్మె