ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఉద్ధృతంగా అమరావతి ఉద్యమం...మహిళా రైతుల వినూత్న నిరసన

By

Published : Nov 21, 2020, 4:41 PM IST

పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఉద్యమం ఉద్ధృతంగా సాగుతోంది. తుళ్లూరులో మహిళలు, రైతులు న్యాయదేవతకు పాలాభిషేకం చేశారు. అనంతవరంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు, మహిళలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు.

ఉద్ధృతంగా అమరావతి ఉద్యమం...రైతుల వినూత్న నిరసన
ఉద్ధృతంగా అమరావతి ఉద్యమం...రైతుల వినూత్న నిరసన

పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఉద్యమం ఉద్ధృతంగా సాగుతోంది. నిరసన దీక్షలు 340వ రోజుకు చేరుకున్నాయి. తుళ్లూరు మండలం అనంతవరంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు, మహిళలు వినూత్న రీతిలో నిరసనను తెలియజేశారు. పోలీసుల నుంచి మహిళలు ఎదుర్కొంటున్న బాధలను కళ్లకు కట్టేలా చూపించారు. మహిళలు, రైతులకు సంకెళ్లు వేసి న్యాయస్థానంలో నిలబెట్టగానే న్యాయమూర్తి పోలీసులకు చీవాట్లు పెట్టి వారిని విడుదల చేశారు. ఈ దృశ్య రూపకం అందరినీ ఆకట్టుకుంది. తుళ్లూరులో మహిళలు, రైతులు న్యాయదేవతకు పాలాభిషేకం చేశారు. కృష్ణాయపాలెం, అబ్బరాజుపాలెం, పెదపరిమి, నీరుకొండ, బోరుపాలెం, మందడం, వెలగపూడి, వెంకటపాలెం గ్రామాల్లో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు.

ABOUT THE AUTHOR

...view details