అమరావతి దీక్షలు 222వ రోజుకు చేరిన సందర్భంగా 29 రాజధాని గ్రామాల్లో నిరసనలు కొనసాగించారు. దళిత ఐకాస ఆధ్వర్యంలో రైతులు, రైతు కూలీలు ఇందులో పాల్గొన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఆందోళన చేపట్టారు. ఐకాస ఆధ్వర్యంలో వెబ్నార్ నిర్వహించగా.. మహిళలు, రైతులు పాల్గొన్నారు. గీతరచయిత రమణ అమరావతి ఉద్యమంపై ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. సీఆర్డీఏ రద్దు, 3 రాజధానుల బిల్లులను గవర్నర్ తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.
'ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించే వరకు ఉద్యమం ఆగదు' - అమరావతి ఉద్యమం వార్తలు
ఏకైక పరిపాలన రాజధానిగా అమరావతిని ప్రకటించే వరకు ఉద్యమం ఆగదని అమరావతి రైతులు స్పష్టం చేశారు. ఉద్యమం 222వ రోజుకు చేరిన సందర్భంగా 29 గ్రామాల్లో దళిత ఐకాస ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగించారు.
అమరావతి