ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మద్యం అమ్మకాలను వెంటనే ఆపాలి' - తూళ్లూరులో లాక్​డౌన్ ప్రభావం

మద్యం అమ్మకాలను వెంటనే ఆపాలని అమరావతి దళిత ఐకాస నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్​, పోలీసులకు వినతి పత్రం అందించారు.

amaravathi JAC protest against wine sellings in andhra prashesh
మద్యం అమ్మకాలు ఆపాలంటూ నిరసన

By

Published : May 5, 2020, 11:30 PM IST

మద్యం అమ్మకాలను వెంటనే ఆపాలంటూ గుంటూరు జిల్లా తుళ్లూరులో అమరావతి దళిత ఐకాస నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు తహసీల్దార్, పోలీసులకు ఫిర్యాదు చేశారు. మద్యం అమ్మకాలతో కొవిడ్ కేసులు పెరుగుతాయని ఐకాస నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం అమ్మకాల వల్ల లాక్​డౌన్ ఫలితాలను బూడిదలో పోసిన పన్నీరులా తయారవుతుందని ఆవేదన చెందారు. గ్రీన్​జోన్​లో సురక్షితంగా ఉన్న ప్రజలు... ప్రభుత్వ చర్యల వల్ల కరోనా కేసులు పెరిగి రెడ్​జోన్​లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details