అమరావతి ఐకాస నేత వంశీకి రెండు వారాల రిమాండ్ - అమరావతి జేఏసీ నేత వంశీ అరెస్టు న్యూస్
అమరావతి పరిరక్షణ సమితి ఐకాస నేత వాసిరెడ్డి వంశీ కృష్ణకు కోర్టు రెండు వారాల రిమాండ్ విధించింది. బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ వాహనాన్ని అడ్డిగించారనే కారణంతో ఇవాళ ఉదయం వంశీని పోలీసులు అరెస్టు చేశారు.
అమరావతి ఐకాస నేత వంశీకి రెండు వారాల రిమాండ్
ఈనెల 24న అమరావతి రథోత్సవానికి వచ్చిన బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ వాహనాన్ని అమరావతి జేఏసీ అడ్డగించింది. ఈ కేసుకు సంబంధించి ఇవాళ తెల్లవారుజామున ఐకాస నేత వంశీకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనకు సత్తెనపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వంశీకృష్ణను సత్తెనపల్లి జూనియర్ సివిల్ జడ్జి ముందు హజరు పరిచారు. న్యాయమూర్తి వంశీకి రెండు వారాల రిమాండ్ విధించారు. పోలీసులు వంశీకృష్ణను సత్తెనపల్లి జైలుకు తరలించారు.
ఇదీ చదవండి:
'మోదీగారూ... అమరావతిపై ఒక్క అరగంట మనసు పెట్టండి'
TAGGED:
amaravathi jac news