ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అమరావతి రైతులకు సంకెళ్లు వేయటంపై కేంద్ర బీసీ కమిషన్​కు ఫిర్యాదు' - సుంకర పద్మశ్రీ తాజా వార్తలు

అమరావతి రైతులకు సంకెళ్లు వేయటంపై కేంద్ర వెనుకబడిన తరగతుల కమిషన్​కు ఫిర్యాదు చేసినట్లు అమరావతి మహిళా జేఏసీ నేత సుంకర పద్మశ్రీ స్పష్టం చేశారు. అమరావతి రైతుల గురించే కాకుండా రాష్ట్రంలో దళితులు, మైనార్టీలపై జరుగుతున్న దాడులను కమిషన్ దృష్టికి తీసుకెళ్లామన్నారు.

అమరావతి రైతులకు సంకెళ్లు వేయటంపై కేంద్ర బీసీ కమిషన్​కు ఫిర్యాదు
అమరావతి రైతులకు సంకెళ్లు వేయటంపై కేంద్ర బీసీ కమిషన్​కు ఫిర్యాదు

By

Published : Jan 11, 2021, 7:55 PM IST

అమరావతి రైతులకు సంకెళ్లు వేయటంపై కేంద్ర వెనుకబడిన తరగతుల కమిషన్​కు ఫిర్యాదు చేసినట్లు అమరావతి మహిళా జేఏసీ నేత సుంకర పద్మశ్రీ స్పష్టం చేశారు. కమిషన్ రీజినల్ డైరెక్టర్ సునీల్ కుమార్​ బాబు.. ఘటనకు సంబంధించిన వివరాలను తనకు ఫోన్​ చేసి అడిగి తెలుసుకున్నారన్నారు.

అమరావతి రైతుల గురించే కాకుండా రాష్ట్రంలో దళితులు, మైనార్టీలపై జరుగుతున్న దాడులను కమిషన్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. వైకాపా నేతల అరాచకాలను కమిషన్ డైరక్టర్​కు వివరించామన్నారు. అమరావతి రైతులతో పాటు బాధిత వెనుకబడిన తరగతులకు న్యాయం చేస్తామని సునీల్ కుమార్ బాబు హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.

ఇదీచదవండి: 'అమ్మఒడి' పేద విద్యార్థులకు శ్రీరామరక్ష: సీఎం జగన్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details