'తగ్గేది లేదు... అమరావతి ఉద్యమాన్ని ఆపేది లేదు' అమరావతికి మద్దతుగా... మూడు రాజధానులకు వ్యతిరేకంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో చిన్నారులు నిరసన దీక్ష చేశారు. పాత బస్టాండ్ వద్ద మంగళగిరి అఖిలపక్ష కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరసన దీక్షలు.. ఆదివారంతో 57వ రోజుకు చేరాయి. పట్టణానికి చెందిన 30 మంది చిన్నారులు దీక్షలో కూర్చుని తమ మద్దతు తెలియజేశారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.
25న భారీ బహిరంగ సభ...
గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 50వ రోజుకు చేరాయి. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధాని నిర్ణయం వెనక్కి తీసుకునేంత వరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తామని నినదించారు. రాజధానిగా అమరావతిని కాంక్షిస్తూ ఈ నెల 25న గుంటూరు నగరంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
రైతుల కోసం బియ్యం విరాళం...
రాజధాని అమరావతి రైతులకు 51 క్వింటాళ్ల బియ్యాన్ని నరసరావుపేట జేఏసీ విరాళంగా ఇచ్చింది. రెండు నెలలుగా రాజధాని అమరావతి కోసం రైతులు చేస్తున్న దీక్షలకు నరసరావుపేట జేఏసీ మద్దతుగా ఉంటుందని జేఏసీ అధ్యక్షుడు చదలవాడ అరవింద బాబు తెలిపారు.
ఇవీ చూడండి