ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజధాని రైతుల ఆందోళన... నల్ల జెండాలతో నిరసన - అమరావతి తాజా వార్తలు

3 రాజధానులపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక, సీఎం జగన్​  వ్యాఖ్యలపై అమరావతి అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని పలు గ్రామాల రైతులు రోడ్లపైకి వచ్చిన నిరసన తెలిపారు. మహిళలు, చిన్నారులు సైతం రైతుల ఆందోళనలకు మద్దతుగా నిలిచారు. జగన్​కు ఓట్లు వేసి గెలిపిస్తే... తమ పొట్ట కొట్టారని ఆవేదన చెందారు. రాజధానుల ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

Amaravathi farmers staged dharna at mangalagiri
రాజధాని రైతుల ఆందోళన

By

Published : Dec 21, 2019, 12:48 PM IST

రాజధాని రైతుల ఆందోళన
రాజధాని వికేంద్రీకరణ ప్రకటనను నిరసిస్తూ అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనలు ఉద్ధృతంగా కొనసాగుతున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెం, కృష్ణాయపాలెం గ్రామాలలో రైతులు, మహిళలు, చిన్నారులు రోడ్లపై బైఠాయించి నల్లజెండాలతో నిరసన తెలిపారు. రోడ్లపై టైర్లు తగలబెట్టి తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో జగన్​కి ఓటు వేశామన్నారు. ఇప్పుడు ఆయనే తమ పొట్టకొట్టారని వాపోయారు. మూడు రాజధానుల ఏర్పాటు ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details