రాష్ట్ర పరిపాలన మెుత్తం అమరావతి నుంచే సాగించాలంటూ రైతులు చేస్తున్న దీక్షలు 165వ రోజుకు చేరుకున్నాయి. ఎస్ఈసీ అధికారిని రక్షించినట్లే...తమ మనో భావాలను న్యాయస్థానాలు పరిగణనలోకి తీసుకుని కాపాడాలని రాజధాని రైతులు విజ్ఞప్తి చేశారు. కరోనా దృష్ట్యా రైతులు భౌతికదూరం పాటిస్తూ... తుళ్లూరు, మందడం, వెంకటపాలెం, దొండపాడులో ఆందోళన కొనసాగించారు. కౌలు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. మూడు రాజధానులు వద్దంటూ..ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతన్నలు నినదించారు.
'ఆ అధికారిని రక్షించినట్లే...తమను రక్షించండి'
ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను పునర్నియమించండంటూ ఇచ్చిన హైకోర్టు తీర్పుపై అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఇదే తరహాలో రాజధాని కోసం పోరాడుతోన్న తమ మనోవేదననూ పరిగణనలోకి తీసుకోవాలని వేడుకున్నారు.
165వ రోజుకు చేరిన అమరావతి రైతుల దీక్షలు