రాజధాని వికేంద్రీకరణను నిరసిస్తూ రాజధాని గ్రామాల్లో రైతుల దీక్షలు 242వ రోజుకు కొనసాగాయి. తుళ్లూరు, మందడం, వెలగపూడి, పెదపరిమి, అబ్బిరాజుపాలెం, మంగళగిరి మండలం నీరుకొండలో రైతులు నిరసనలు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాలతో రైతులు ధర్నాలో పాల్గొన్నారు. దీక్షా శిబిరాల వద్దే జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. తమకు న్యాయస్థానాలు అండగా ఉంటాయని.. స్వాతంత్య్ర ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని.. అమరావతిని సాధిస్తామని రైతులు స్పష్టం చేశారు.
'స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో.. అమరావతిని సాధిస్తాం' - అమరావతి రైతుల దీక్షల వార్తలు
అమరావతి కోసం రాజధాని ప్రాంతాల్లో రైతుల దీక్షలు కొనసాగుతున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాలతో రైతులు నిరసనల్లో పాల్గొన్నారు. స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో అమరావతిని సాధిస్తామని రైతులు స్పష్టం చేశారు.
'స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో.. అమరావతిని సాధిస్తాం'