పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు 307వ రోజు ఉద్యమాన్ని కొనసాగించారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, కృష్ణాయపాలెం, అనంతవరం, ఐనవోలు, వెంకటపాలెం, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, రాయపూడి, ఎర్రబాలెం, నీరుకొండ గ్రామాల్లో ఆందోళనలు కొనసాగించారు.
అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. మూడు రాజధానులు వద్దంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ఇప్పటివరకు ఒక్క రహదారినైనా వేయని ప్రభుత్వం 3 రాజధానులను ఎలా నిర్మిస్తుందని రైతులు నిలదీశారు. నీరుకొండలో పాదయాత్ర నిర్వహించారు. ఆకుపచ్చ జెండాలతో ప్రదర్శన చేపట్టారు. దొండపాడులో పసుపు-కుంకుమార్చన పూజలు చేశారు.