ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో జనసేన అఫడవిట్ దాఖలు చేసిన సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ చిత్రపటానికి ఐనవోలు రైతులు పాలాభిషేకం చేశారు. పవన్ కల్యాణ్ ఎప్పుడూ రాజధానికి అనుకూలంగానే ఉన్నారంటూ నినాదాలు చేశారు. అమరావతి నిర్మాణం చేతకాకపోతే ముఖ్యమంత్రి పక్కకు తప్పుకోవాలని హితవు పలికారు. తుళ్లూరులో మహిళలు జై అమరావతి అంటూ కోటి సార్లు రాశారు. ప్రజా రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ నినాదాలు చేశారు. బోరుపాలెం, వెంకటపాలెం, ఎర్రబాలెం, అబ్బరాజు పాలెం, నీరుకొండ గ్రామాల్లోనూ రైతులు 282వ రోజు దీక్షలు కొనసాగించారు.
హైకోర్టులో జనసేన పిటిషన్.. పవన్ చిత్రపటానికి రైతుల క్షీరాభిషేకం - ఏపీ రాజధాని తాజా అప్ డేట్స్
అమరావతి దీక్షలు 282వ రోజూ కొనసాగాయి. హైకోర్టులో జనసేన అమరావతినే కొనసాగించాలంటూ పిటిషన్ వేసింది. ఇందుకుగాను ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు అమరావతి రైతులు పాలాభిషేకం చేశారు.

పవన్ చిత్రపటానికి రైతుల పాలాభిషేకం