పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న ఉద్యమం 272వ రోజుకు చేరుకుంది. తుళ్లూరు, మందడం, వెలగపూడి, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, అనంతవరం, రాయపూడి, పెదపరిమి, దొండపాడు గ్రామాల్లో రైతులు ఆందోళనలను కొనసాగించారు. దొండపాడులో రాజధాని రైతుల పరిరక్షణ ఆధ్వర్యంలో దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
తుళ్లూరులో మహిళలు లలితా సహస్రనామస్తోత్ర పారాయణం, ఓం నమః శివాయ మహామంత్రం, గేయామృతం చేశారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని మహిళలు రైతులు దైవారాధన చేశారు. అబ్బరాజుపాలెం, కృష్ణాయపాలెంలో రైతులు వర్షంలోనూ ఆందోళనను కొనసాగించారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతులు డిమాండ్ చేశారు.