అధర్మం పరిపాలన చేస్తుంటే న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవని అమరావతి రైతులు అన్నారు. తామంతా రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చామని.. పేదల ఇళ్ల స్థలాల కోసం కాదని అన్నారు. తమ ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రభుత్వం పని చేస్తోందని.. అందుకే తాము న్యాయస్థానాలను ఆశ్రయించామని చెప్పారు. తాము చేస్తున్న ధర్మపోరాటానికి న్యాయదేవత అండగా నిలిచిందని రైతులుసంతోషం వ్యక్తం చేశారు. రాజధాని గ్రామాల్లో 244వ రోజు నిరసన దీక్షలు కొనసాగించారు.
'పేదల ఇళ్ల స్థలాల కోసం కాదు..రాజధాని నిర్మాణానికి భూములిచ్చాం' - అమరావతి రైతుల దీక్షలు
244వ రోజు రాజధాని దీక్షలు కొనసాగించారు. తుళ్లూరు మండలం అబ్బిరాజుపాలెంలో రైతులు భిక్షాటన చేశారు. అనంతవరం, వెంకటపాలెం, పెదపరిమి, మంగళగిరి, కృష్ణాయపాలెం, ఎర్రబాలెంలో ఆందోళనలు నిర్వహించారు.
అమరావతి దీక్షలు