ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న దీక్షలు 235వ రోజుకు చేరుకున్నాయి. గుంటూరు జిల్లా తుళ్లూరు, మందడం, అబ్బిరాజుపాలెం, అనంతవరం, పెదపరిమి గ్రామాల్లో నిర్వహించిన ఆందోళనల్లో రైతులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. వైకాపా ప్రభుత్వం దళిత రైతులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెంచిన పెన్షన్, కౌలు డబ్బులు చెల్లించాలని కోరారు. రాజధాని విషయంలో న్యాయస్థానాలే తమకు న్యాయం చేస్తాయని రైతులు విశ్వాసం వ్యక్తం చేశారు.
235వ రోజుకు అమరావతి దీక్షలు - అమరావతి రైతుల ధర్నా
ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న దీక్షలు 235వ రోజుకు చేరుకున్నాయి. రాజధాని విషయంలో న్యాయస్థానాలే తమకు న్యాయం చేస్తాయని రైతులు విశ్వాసం వ్యక్తం చేశారు.
235వ రోజుకు అమరావతి దీక్షలు