రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న దీక్షలు 258వ రోజుకు చేరుకున్నాయి. 29 గ్రామాలలోనూ అమరావతి ఉద్యమం ఉద్ధృతంగా సాగుతోంది. కృష్ణాయపాలెంలో రైతులు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ నినాదాలు చేశారు. మందడం, వెలగపూడిలలో రైతులు దీక్షలు కొనసాగాయి. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటించేదాక ఆందోళనలను కొనసాగిస్తామని రైతులు మరోసారి తేల్చి చెప్పారు.
258వ రోజుకు చేరిన రాజధాని రైతుల దీక్షలు - protest news in amaravathi farmers
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు చేస్తున్న దీక్షలు 258వ రోజుకు చేరుకున్నాయి. కృష్ణాయ పాలెంలో రైతులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు.
amaravathi farmers protest reached to 258days