ఏకైక రాజధానిగా అమరావతే కావాలని ఆందోళన చేస్తున్న రైతుల దీక్ష 405వ రోజుకు చేరింది. పంచాయతీ ఎన్నికలపై సుప్రీం కోర్టు తీర్పు చూసైనా... జగన్ సర్కార్ దిగి రావాలని రైతులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రాజధాని విషయంలో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రభుత్వానికి భంగపాటు తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం... భూములను త్యాగం చేశామని గుర్తు చేశారు. ఇకనైనా ప్రభుత్వం మేల్కొని... రాజధానిగా అమరావతిని ప్రకటించాలన్నారు.
"పంచాయతీ ఎన్నికలపై సుప్రీం తీర్పు చూసైనా... ప్రభుత్వం దిగిరావాలి" - రాజధాని రైతుల నిరసన
పంచాయతీ ఎన్నికల విషయంలో సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చూసైనా ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోవాలని రాజధాని అన్నదాతలు కోరారు. రాష్ట్రానికి ఓకే రాజధానిగా అమరావతే ఉండాలని... గుంటూరు జిల్లాలో రైతులు చేస్తున్న నిరసన 405వ రోజు కొనసాగింది. మూడు రాజధానులు వద్దు... ఒక రాజధాని ముద్దు అంటూ నినాదాలు చేశారు.
రైతుల ఆందోళన