అమరావతే ఏకైక రాజధాని లక్ష్యంగా రైతులు చేస్తున్న ఉద్యమం 280వ రోజుకు చేరుకుంది. నీరుకొండ, ఎర్రబాలెం, వెంకటపాలెం, ఐనవోలు, అబ్బరాజుపాలెం, బోరుపాలెం, రాయపూడి, పెదపరిమి గ్రామాల్లో నిరసన దీక్షలు కొనసాగించారు. ముఖ్యమంత్రి జగన్ మనసు మారాలని కోరుతూ...బోరుపాలెంలో రైతులు మహాలక్ష్మి అమ్మవారికి బోనాలు సమర్పించారు. అబ్బరాజు పాలెంలో బిక్షాటన చేసిన రైతులు.. ఆ సొమ్మును ముఖ్యమంత్రికి పంపి రాజధాని నిర్మాణానికి తమ వంతు సాయం చేస్తామన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకొని ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించే వరకు ఆందోళనలను కొనసాగిస్తామని రైతులు తేల్చిచెప్పారు.
'అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలి' - అమరావతి రైతులు తాజా వార్తలు
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు చేస్తున్న దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. 280వ రోజుకు చేరుకున్న ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతూనే ఉంది. ఇవాళ పలు గ్రామాల్లో రైతులు, మహిళలు అమరావతికి మద్దతుగా దీక్షలు, నిరసనలు చేపట్టారు.
అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలి