రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు, మహిళలు చేస్తున్న ధర్నాలు 197వ రోజుకు చేరుకున్నాయి. తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని రాజధాని గ్రామాల్లో రైతులు, మహిళలు ధర్నా చేపట్టారు. తొలి ఏకాదశి సందర్భంగా కృష్ణాయపాలెం, మందడంలోని గణపతి ఆలయాల్లో మహిళలు, రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణాయపాలెంలో రైతులు 108 కొబ్బరి కాయలు కొట్టారు. మందడంలో 1108 కొబ్బరి కాయలు కొట్టి స్వామి వారికి మొక్కులు చెల్లించారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని స్వామివారికి వినతులు సమర్పించారు. త్వరలోనే రాజధానిగా అమరావతినే కొనసాగిస్తామనే ప్రకటన రాబోతుందని రాజధాని పరిరక్షణ సమితి కన్వీనర్ పువ్వాడ సుధాకర్ చెప్పారు.
అమరావతి రైతుల నిరసన... ఆలయాల్లో ప్రత్యేక పూజలు
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ... తుళ్లూరు, మందడం, కృష్ణాయపాలెం రైతులు, మహిళలు ధర్నా చేపట్టారు. తొలి ఏకాదశి సందర్భంగా ఆలయాల్లో వారంతా ప్రత్యేక పూజలు చేసి నిరసన తెలిపారు.
అమరావతి రైతుల నిరసన