అమరావతి రైతుల పోరాటం డిసెంబర్ 17తో ఏడాది పూర్తి కావటంతో.. ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. గుంటూరు జిల్లా పెదపరిమిలో రైతులు, మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. వీరికి సంఘీభావంగా తెదేపా నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, శ్రావణ్ కుమార్, కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ పాల్గొన్నారు. ఏడాది నుంచి తాము ఉద్యమిస్తున్నా.. సర్కారు నుంచి కనీస స్పందన లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని ఏకైక రాజధానిగా సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని రైతులు, మహిళలు తేల్చిచెప్పారు.
పెదపరిమిలో రైతుల నిరసన - గుంటూరు జిల్లా వార్తలు
అమరావతి ఉద్యమానికి ఏడాది పూర్తైన సందర్భంగా.. గుంటూరు జిల్లా పెదపరిమిలో రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. రాజధానిని ఇక్కడి నుంచి తరలిస్తుంటే చూస్తు ఊరకోబోమని రైతులు హెచ్చరించారు. ఏడాది నుంచి ఉద్యమిస్తున్న రైతులకు తెదేపా నేతలు సంఘీభావం తెలిపారు.
amaravathi farmers protest in pedaparimi at guntur district