ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా నేతలపై మండిపడ్డ రాజధాని రైతులు

రాజధాని కోసం అమరావతి రైతులు చేస్తున్న దీక్షలు 252వ రోజుకు చేరుకున్నాయి. రాజధానిలో ఉద్యమం లేదన్న వైకాపా నేతల వ్యాఖ్యలపై రైతులు మండిపడ్డారు.

By

Published : Aug 25, 2020, 5:40 PM IST

amaravathi farmers protest
252వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల దీక్షలు

తమ వైపు ధర్మం ఉంది కాబట్టి న్యాయస్థానాలు తమకు అండగా నిలిచాయని రాజధాని రైతులు అన్నారు. పరిపాలనా రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న దీక్షలు 252 రోజుకు చేరుకున్నాయి. కృష్ణాయపాలెం, వెలగపూడిలో రైతులు దీక్షా శిబిరాల వద్ద నినాదాలు చేశారు. రాజధానిలో ఉద్యమం లేదన్న వైకాపా నేతల వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఎలాంటి భద్రత లేకుండా రాజధాని గ్రామాల్లో తిరిగితే ఉద్యమం ఉందో లేదో తెలుస్తోందన్నారు.

రాజధానిలో 16 శాతానికి పైగా ఎస్సీలు భూమిని ఇచ్చారని... ఇప్పుడు వారి పరిస్థితి ఎలా ఉందో చూడాలని డొక్కా మాణిక్య వరప్రసాద్​కు సవాల్ విసిరారు. ఒక ఎస్సీ నాయకుడై ఉండి తోటివారిపై ఇలాగేనా ప్రవర్తించేది అని రైతులు వాపోయారు. ఈ ప్రాంతం నుంచి ఎన్నికైన డొక్కా మాణిక్య వరప్రసాద్ ఇలా ప్రవర్తించడం సరికాదని హితవు పలికారు.

ABOUT THE AUTHOR

...view details