ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఆర్‌డీఏ కమిషనర్​తో అమరావతి ప్రాంత రైతుల భేటీ

రాజధాని అమరావతి ప్రాంత రైతులు సీఆర్​డీఏ కమిషనర్​ను కలిశారు. సీఎంతో జరిగిన సీఆర్‌డీఏ సమీక్ష సమావేశం అనంతరం... అపోహలు తొలగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్లాట్లు అభివృద్ధి చేసి ఇస్తామనే హామీతో సంతృప్తి చెందుతున్నామన్నారు.

amaravathi farmers meet CRDA commissioner
సీఆర్‌డీఏ కమిషనర్​తో అమరావతి ప్రాంత రైతులు భేటీ

By

Published : Nov 26, 2019, 8:41 PM IST

సీఆర్‌డీఏ కమిషనర్​తో అమరావతి ప్రాంత రైతుల భేటీ

రాజధాని అమరావతి ప్రాంత రైతులు కొందరు విజయవాడలోని సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయంలో కమిషనర్‌ లక్ష్మీనరసింహంతో సమావేశమయ్యారు. సీఎంతో జరిగిన సీఆర్‌డీఏ సమీక్ష సమావేశం అనంతరం అపోహలు తొలగించారని కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ నిర్మాణాల సముదాయం, భవనాల నిర్మాణంలో అనవసరమైన ఆర్భాటాలకు పోకుండా... పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారని కమిషనర్‌ వారికి తెలిపారు.

సీఆర్‌డీఏ పరిధిలోని రహదారులను ప్రాధాన్యక్రమంలో నిర్మిస్తామని... కృష్ణానది సమీపంలో కొండవీటి వాగు, పాలవాగు వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని... గత ప్రణాళికకు అనుగుణంగా చర్యలు చేపడతామని అధికారులు వివరించినట్లు రైతులు చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పనలో అనవసర వ్యయం తగ్గించి, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వ ఉద్దేశమని రైతులు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details