రాజధానిపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను అమరావతి రైతులు తిప్పికొట్టారు. పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ... గుంటూరులోని మందడం, కృష్ణాయపాలెం, వెలగపూడి, తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెంలో రైతులు 267 రోజు ఆందోళనలు కొనసాగించారు.
మంత్రి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దీక్షా శిబిరం వద్ద రైతులు నినాదాలు చేశారు. కొడాలి నాని గుడివాడలో సంపాదించిన ఆస్తులు... రాష్ట్రంలోని పేదలకు పంచి పెట్టాలని రైతులు డిమాండ్ చేశారు. తామంతా తమ తరాలకు... భవిష్యత్ ను తాకట్టుపెట్టి రాజధాని కోసం భూములు ఇచ్చామని, పేదల ఇళ్ల కోసం కాదని గుర్తు చేశారు. తమ ఆకాంక్షలకు వ్యతిరేకంగా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.